Monday, March 30, 2020

కొరోనా కోరల్లో నా భారతదేశం

   

     సొమ్మొకడిది ..  సోకొకడిది .. అన్నట్టు.  తప్పొకడిది  శిక్ష  అందిరిది  అయ్యింది.
దురాశ  దుఃఖానికి  చేటు  అంటారు .  కానీ కొంత  మంది  దురాశ  వల్ల  ప్రపంచం  మొత్తం  దుఃఖిస్తుంది.  ఇది  ఎవరి  కుట్రయినా ,  తప్పిదమైనా , శాస్త్ర  విజ్ఞాన  దుష్ప్రభావాలైనా  ప్రపంచం  ఇంతటి  భారీ  మూల్యం  చెల్లిస్తుంది .

        మన  దేశం  పై  చిన్న  చూపున్న  చైనా  దేశానికి  భస్మాసుర   పథకాన్ని  రుచి  చూపించి,  సూర్య కాంతి  పూతోట  లాంటి  నా  దేశాన్ని కాలుడి  కారు  మబ్బు  కమ్మినట్టు  కమ్ముతూ  వస్తుంది  ఈ  రక్కసి . రావణ  కాష్టం  లాగా  చైనా , అమెరికా , ఇటలీ , స్పెయిన్  దేశాల్ని  దహిస్తూ  నా దేశంలో  సేద  తీరేందుకు  సన్నద్ధం చేస్తుంది.

        ప్రపంచం  మొత్తం  జయించాలనే  ఆ  విశ్వ  విజేత  గ్రీకువీరుడు  అలెగ్జాండర్ ని  మించి  రాజ్యాలను  జయించావని  గెలుపు  గర్వం తో  వికటాట్ట హాసం  చేస్తూ  నా  దేశం  చేరావు .  ఓటమంటూ  ఎరుగని  ఆ విశ్వ విజేతని  ఓడించిన  పురుషోత్తముడు  పుట్టిన  పుణ్య భూమి  ఇది.  గుర్తుంచుకో   నీకు  అంత్యక్రియలు  చేసే  సమయం  ఆసన్నమైంది.

        వేదం  ఉద్బవించిన  దేశం  నాది,  ఆయుర్వేదం  పురుడు  పోసుకున్న  దేశం  నాది,   ప్రపంచానికి  సంస్కారం  నేర్పించిన  దేశం  నాది. కొండను  ఢీ కొట్టిన  పొగరుబట్టిన  పొట్టేలు  వలె .. నా  దేశాన్ని  ఢీ  కొట్టాలనుకున్న  నీ  ణాలు  రోదిస్తూ  శిస్తాయి ..!


1 comment:

Prasanna Kumar said...

వేదం ఉద్బవించిన దేశం నాది, ఆయుర్వేదం పురుడు పోసుకున్న దేశం నాది, ప్రంపంచానికి సంస్కారం నేర్పించిన దేశం నాది. కొండను ఢీ కొట్టిన పొగరుబట్టిన పొట్టేలు వలె .. నా దేశాన్ని ఢీ కొట్టాలనుకున్న నీ కణాలు రోదిస్తూ నశిస్తాయి ..!

Excellent