చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడు వస్తాడు అన్నది ఎంత నిజమో ..!
పెళ్ళయితే సంతోషం దూరమౌతుందని అనేది అంత నిజం ..!
తల్లి ప్రేమ స్వార్ధం అనేది ఎంత అబధ్దమో ..!
ఆలి మనసు కర్కశం అనేది కూడా అంత అబద్ధం ..!
ఉత్త్తర దక్షిణ ధ్రువాల వల్లే భూమి సక్రమంగా భ్రమిస్తుంది ..
భార్యభర్తల వల్లే సంసార చక్రం సక్రమంగా భ్రమిస్తుంది ..
కంటికి రెప్పలా తోడుండేది అమ్మ ప్రేమయితే ..!
కలలో కూడా కంటికి రెప్పలా తోడుండేది భార్య ప్రేమ ..!
మన కోసం సర్వసం ఇచ్ఛే తల్లి ప్రేమ గొప్పదయితే ..!
మన కోసం సర్వసం వదులుకొని వఛ్చిన భార్య ప్రేమ అంత కంటే గొప్పది ..!
నీ భార్య నీకు భారం అనిపిస్తే .. దానికి కారణం నువ్వు చేసిన పాపం ..!
నీ భారం నీకు భాగం అనిపిస్తే .. దానికి కారణం నువ్వు చేసిన పుణ్యం, నీ భార్య ..!
మూడేళ్ళ పసివాడు మొండి చేస్తే .. సముదాయించ గలిగేది అమ్మ ..!
ముప్పయేళ్ల పసివాడు మొండి చేస్తే .. సముదాయించ గలిగేది భార్య .!
మనిషికి వున్న గుణాల్లో గొప్ప గుణం .. క్షమా గుణం ..!
మనిషికి ఉండాల్సిన ప్రాధిమిక గుణం కృతజ్ఞతా గుణం ..!
ఇన్నీ రోజులు నాకు.. నా వాళ్లకు సపర్యలు చేసిన నా సగ భాగానికి నా కృతజ్ఞతలు ..! ఇంత కంటే ఏమి చెప్పగలను ..!
